: డెబిట్, క్రెడిట్ కార్డులు భవిష్యత్తులో కనుమరుగవుతాయి!: నీతి ఆయోగ్ చీఫ్ అమితాబ్ కాంత్


అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికత డిజిటల్ లావాదేవీలను పెంచుతున్న వేళ సమీప భవిష్యత్తులో క్రెడిట్, డెబిట్ కార్డులు, ఏటీఎం కేంద్రాలు మాయం కానున్నాయని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ అంచనా వేశారు. ఇండియాను అభివృద్ధి దిశగా నడిపించడంలో ఆర్థిక సంస్కరణలు కీలకం కానున్నాయని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

మొబైల్ వాలెట్లు, బయోమెట్రిక్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్స్ వేగవంతమైనాయని, ఫిజికల్ బ్యాంకింగ్ పూర్తిగా చచ్చుబడి పోనుందని అన్నారు. వచ్చే మూడు నాలుగేళ్లలో 90 శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలోనే జరుగుతాయని, ఏటీఎం కేంద్రాలన్నీ మూతపడే అవకాశాలున్నాయని చెప్పారు. 

  • Loading...

More Telugu News