: ఇక జగన్ కు నిద్రలేని రాత్రులే: గంటా శ్రీనివాస్


రాబోయే రోజులన్నీ వైకాపా అధినేత వైఎస్ జగన్ కు నిద్రలేని రాత్రులను మిగల్చనున్నాయని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. వైకాపా నుంచి ఫిరాయించిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రామసుబ్బారెడ్డిని బుజ్జగించేందుకు వచ్చిన గంటా, గత రాత్రి 12 గంటల సమయంలో మీడియాతో మాట్లాడారు. రామసుబ్బారెడ్డి వెంట ఎందరో అభిమానులు ఉన్నారని, ఆయన తమకు ముఖ్యమైన నేతని అన్నారు. ఆయనకు ప్రాధాన్యతను తగ్గించబోవడం లేదని, ఎమ్మెల్సీగా తీసుకుని ప్రభుత్వ విప్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ హోదాను కల్పించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. కడప జిల్లాలో అన్ని వర్గాలూ ఒక తాటిపై నడుస్తున్నాయని, అభివృద్ధే థ్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పిన ఆయన, ఇక జగన్ ఆధిపత్యాన్ని కొనసాగనివ్వబోమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News