: స్టార్ హోటల్ భోజనం కోసం నాటకమాడిన జంట!


మనదేశంలో పెద్దగా ఆఫర్లు ఉండవు కానీ, పాశ్చాత్య దేశాల్లో రెస్టారెంట్లు వినూత్న ఆఫర్లతో వినియోగదారులను పెంచుకుంటాయి. పబ్లిసిటీలో భాగంగా వివిధ వేడుకలను నిర్వహిస్తూ... ఉచిత భోజనం ఆఫర్లు పెడుతుంటారు. అలాంటి ఆఫర్ ను వినియోగించుకునేందుకు ఓ యువకుడు, యువతి ఆడిన నాటకం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దాని వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని టెక్సాస్ నగరంలో ఓ స్టార్ హోటల్ యాజమాన్యం తమ హోటల్ రెస్టారెంట్ లో ఎంగేజ్‌ మెంట్ చేసుకున్న జంటకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. హోటల్ పెద్దది కావడంతో అక్కడ ఎలాగైనా భోజనం చేయాలని భావించిన కాటీ డోమిత్రోవిచ్ (19), అలెక్సా నాగ్లీ (17) అనే జంట సరికొత్త నాటకానికి తెరతీశారు.

తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని, ఆ హోటల్ రెస్టారెంట్ లో ఎంగేజ్‌ మెంట్ చేసుకుంటామని నమ్మించారు. దీంతో ఆ రెస్టారెంట్ లో అందరూ చూస్తుండగా ఉంగరాలు మార్చుకున్నారు. ఇదంతా నిజమేనని నమ్మిన రెస్టారెంటు యాజమాన్యం వారిద్దరికీ అభినందనలు తెలిపి, పసందైన విందును అందజేసింది. దానిని సుష్టుగా ఆరగించిన ఆ జంట భోజనం బాగుందని చెప్పి.... బయటకు వచ్చిన తరువాత తమ ఎంగేజ్‌ మెంట్ అబద్ధమని, ఉచిత భోజనం కోసమే తామిలా చేశామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో వారిని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. భోజనం కోసం ఎంగేజ్ మెంట్ ను పావుగా చేసుకోవడమేంటని మండిపడుతున్నారు. 

  • Loading...

More Telugu News