: ఎమ్మిగనూరులో భారీ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీ డ్రగ్ రాకెట్ బయటపడింది. ఆర్ఎంపీ వైద్యులు నాగేశ్వరరావు, మునుస్వామి ఎమ్మిగనూరు పరిసరాల్లోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యంతో బాధపడేవారిని లక్ష్యంగా చేసుకుని అత్యంత చౌకగా దొరికే మందుల సీసాలకు చెందిన లేబుల్ ను తీసేసి, అత్యంత ఖరీదైన మందు లేబుల్ ను అతికించి విక్రయిస్తున్నారు. గత మూడేళ్లుగా వీరు ఈ దందాకు తెరలేపారని తెలుస్తోంది. వీరితో పలు మందుల దుకాణాల యజమానులు, వివిధ ఆసుపత్రుల వైద్యులు, ప్రింటింగ్ ప్రెస్ లు కుమ్మక్కయ్యాయని గుర్తించారు. దీంతో వారి నుంచి ఈ మందులు భారీ ఎత్తున స్వాధీనం చేసుకుని, ఈ దందాకు తెరలేపిన అందర్నీ అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.