: కరణ్ జొహార్ పిల్లల కోసం నర్సరీ రూపొందించిన షారూఖ్ భార్య గౌరీ


బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జొహార్ పిల్లలకు నర్సరీని బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ రూపొందించారు. ఇకపై ప్రపంచంలో తనకు ఇష్టమైన ప్రదేశం ఇదేనని కరణ్ జోహర్ తెలిపాడు. తన పిల్లల కోసం ప్రేమ, ఆప్యాయతతో నర్సరీని రూపొందించిన గౌరీ ఖాన్ కు ధన్యవాదాలు తెలిపాడు. అవివాహితుడైన కరణ్ జొహార్ సరోగసీ విధానం ద్వారా ఒక బాబు, పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బాబుకు తన తన తండ్రి యష్ జొహార్ పేరు కలిసి వచ్చేలా యష్ అని, పాపకు తన తల్లి హీరూ పేరు కలిసి వచ్చేలా రూహీ అంటూ పేరుపెట్టిన సంగతి తెలిసిందే. ఇకపై తన ప్రపంచం మొత్తం తన పిల్లలే అని కరణ్ జోహర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.



  • Loading...

More Telugu News