: ఆదినారాయణరెడ్డి వైఎస్సార్సీపీ నుంచి వచ్చారు... మేము పార్టీ కోసం జైలుకు కూడా వెళ్లి వచ్చాం: రామసుబ్బారెడ్డి


కడప జిల్లా నేతలతో ఇన్ చార్జీ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇస్తున్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమకు చెప్పలేదని అన్నారు. ఆదినారాయణ రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చారని ఆయన గుర్తుచేశారు. తాము పార్టీ కోసం కష్టపడుతున్నామని, పార్టీ కోసం జైలుకు కూడా వెళ్లామని ఆయన తెలిపారు. దీనిపై చంద్రబాబు తమ అభిప్రాయం అడిగితే జిల్లా ప్రజల అభీష్టాన్ని వివరిస్తామని ఆయన గంటాకు స్పష్టం చేశారు.

దీనిపై ఎమ్మెల్యే మల్లికార్జునరావు మాట్లాడుతూ, జిల్లాలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని అన్నారు. పార్టీ టిక్కెట్ పై గెలిచిన వారికి అధ్యక్షుడు మంత్రి పదవి ఇస్తారని భావిస్తున్నామని ఆయన చెప్పారు. పార్టీని మొదటి నుంచి నమ్ముకున్నవారికి మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News