: సొంత పార్టీకి షాక్ ఇచ్చిన కన్నడ కాంగ్రెస్ నేత... ఆర్ఎస్ఎస్ చీఫ్ ను రాష్ట్రపతిని చేయాలంటూ ప్రధానికి లేఖ


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ను దేశ తదుపరి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ ప్రధాని మోదీకి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ నేత లేఖ రాశారు. బీజేపీ నేత అనుకుంటే పొరపాటే. లేఖ రాసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జాఫర్ షరీఫ్ కావడం విశేషం. పార్టీ విధానానికి వ్యతిరేకంగా వ్యహరించడం ద్వారా షరీఫ్ గీత దాటినట్టయింది. మోహన్ భగవత్ దేశభక్తి విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదని షరీప్ అన అభిప్రాయాన్ని తేల్చి చెప్పారు.

‘‘దేశంలో ఎన్నో రకాల ఆలోచనలు కలిగిన స్కూళ్లున్నాయి. ఇంతపెద్ద దేశంలో అలా ఉండడం సాధారణమే. శ్రీ మోహన్ భగవత్ వీటిలో ఓ స్కూల్ (ఆర్ఎస్ఎస్) కు చెందిన వారు. కానీ, ఆయన దేశభక్తి విషయంలో ఎటువంటి అనుమానం అవసరం లేదు. దేశ ప్రజలను ప్రేమిస్తూ, జాతికి విధేయంగా ఉన్నారు’’ అని ప్రధానికి రాసిన లేఖలో షరీప్ పేర్కొన్నారు. మరోపక్క, మోహన్ భగవత్ ను రాష్ట్రపతిగా చేసేందుకు ప్రయత్నిస్తే తాము అడ్డుకుంటామని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి తాము మద్దతు పలికేది లేదని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News