: ఆర్ఎస్ఎస్ నేత మృతి.. ఆస్పత్రిలో ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేసిన కార్యకర్తలు
మధ్యప్రదేశ్, ఇండోర్‌లోని గోకుల్ దాస్ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్ఎస్ఎస్ నాయకుడు హిమ్మత్ రాథోడ్ మృతి చెందారు. అయితే, ఆయన మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకొని, ఆసుపత్రిపై దాడికి దిగారు. ఆసుపత్రిలోని ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.