: ఆసుప‌త్రిలోకి ప్రవేశించిన పాములు... పరుగులంకించుకున్న రోగులు, సిబ్బంది


గుర్గామ్ ప్రభుత్వ ఆసుపత్రిలోకి పాములు ప్ర‌వేశించ‌డంతో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఆసుప‌త్రిలో రెండు పాములు తిరుగుతుండ‌డాన్ని చూసిన రోగులు, వారి బంధువులు, ఆసుప‌త్రి సిబ్బంది బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఆ పాములు రెండు అడుగుల పొడవు ఉన్నాయ‌ని రోగులు చెప్పారు. ఈ స‌మాచారాన్ని అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారులకు అందడంతో పాములు పట్టేవారు వచ్చి ఓ పామును పట్టుకున్నారు. మరో పామును కొందరు వ్య‌క్తులు కొట్టి చంపేశారు. వైద్యం కోసం వ‌చ్చి బెడ్‌పై నుంచి లేవ‌లేకుండా బాధ‌ప‌డుతున్న త‌మ‌తో పాములు ప‌రుగులు పెట్టించాయని, ఇటువంటి ఘ‌ట‌న‌లు మళ్లీ జ‌ర‌గ‌కుండా చూడాల‌ని రోగులు కోరారు. ఆసుపత్రిలో తరచూ పాములు క‌న‌ప‌డుతున్నాయ‌ని, ఆసుపత్రి అంతా తనిఖీలు చేయించాల‌ని వైద్యులు అన్నారు.

  • Loading...

More Telugu News