: శ్రీవారికి లారీని బహూకరించిన అశోక్ లేలాండ్ కంపెనీ
అశోక్ లేలాండ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె.దాసరి ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుని, తమ కంపెనీ తరఫున వేంకటేశ్వరుడికి ఓ లారీని బహూకరించారు. ఆ లారీకి ఆలయ పండితులు పూజలు నిర్వహించారు. ఈ వాహనం విలువ రూ. 18.88 లక్షలు ఉంటుందని వినోద్ తెలిపారు. లారీకి సంబంధించిన పత్రాలు, తాళాలను తిరుమల జేఈవో శ్రీనివాసరాజుకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా వినోద్ ను జేఈవో శ్రీనివాసరాజు సన్మానించి సత్కరించారు. ఈ లారీని శ్రీవారి ఆలయ పనుల అవసరాలకు వినియోగించనున్నారు.