: సీఎం ఫోన్ కాల్... ప్రెస్ మీట్ రద్దు చేసి హుటాహుటీన వెళ్లిన ఎంపీ కేశినేని నాని!
టీడీపీ ఎంపీ కేశినేని నాని విజయవాడలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు మీడియా ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. దీంతో విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలోని ఆయన కార్యాలయానికి మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ఇంతలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంపీ కేశినేని నానికి ఫోన్ చేశారు. ప్రెస్ మీట్ రద్దు చేసి తన వద్దకు రావాలని చంద్రబాబు ఫోన్ లో ఆదేశించారు. దీంతో ఎంపీ కేశినేని నాని మీడియా సమావేశం రద్దు చేసి హుటాహుటీన ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు. దీంతో, ఎంపీ కేశినేని నాని ఏం మాట్లాడాలనుకున్నారు? సీఎం ఆయనను ఎందుకు రమ్మన్నారు? అన్న విషయాలపై సస్పెన్స్ నెలకొంది.