: వైద్యులూ! రోగులతో ప్రేమగా వ్యవహరించండి: వెంకయ్య నాయుడు
దేవుడి తర్వాత ప్రజలు మొక్కేది వైద్యులకేనని, రోగులు ఆసుపత్రులకు వచ్చినప్పుడు వారితో ప్రేమగా వ్యవహరించాలని, నాణ్యమైన వైద్యం అందించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ 774 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. దీంతో పాటు, ఇండోర్ స్టేడియం, ఎఫ్ఎం రేడియో స్టేషన్, పాస్ పోర్టు కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, రోగులతో వైద్యులు ప్రేమతో వ్యవహరించి వారి మన్ననలు పొందాలన్నారు. వైద్యం, విద్య ప్రజలకు ఖరీదుగా మారిపోయాయని అన్నారు.