: ఖరగ్ పూర్ ఐఐటీలో చదువుతున్న తెలుగు విద్యార్థి ఆత్మహత్య


ఖరగ్ పూర్ ఐఐటీలో చదువుతున్న తెలుగు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన సానా శ్రీరాజ్ ఐఐటీ ఖరగ్ పూర్ లో ఎలక్ట్రానిక్స్ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఐఐటీలోని లాల్ బహూదూర్ శాస్త్రి హాస్టల్ లో ఉంటున్నాడు. ఖరగ్ పూర్ లోని పూరీ గేట్ లెవెల్ క్రాసింగ్ దగ్గర రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఐఐటీకి చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలియడంతో ఐఐటీలో విషాదం అలముకొంది. 

  • Loading...

More Telugu News