: శాసనసభలో వైసీపీ సభ్యుల ఆందోళన.. సభ నిరవధిక వాయిదా


మొగ‌ల్తూరు బాధితుల‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు ఆందోళన కొన‌సాగించారు. ఈ నేప‌థ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌ధ్య వాగ్వివాదం జ‌రిగింది. ఆ సమయంలో జగన్‌ మాట్లాడుతుంటే స్పీకర్ కోడెల శివ‌ప్రసాద్ అభ్యంత‌రం తెలుపుతూ... సమస్యపై మాట్లాడకుండా ఆరోపణలకే ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. దీంతో ఆగ్ర‌హం తెచ్చుకున్న వైసీపీ స‌భ్యులు పోడియంపైకి ఎక్కి నిరసన తెలిపారు. కాసేప‌టికే స్పీక‌ర్ కోడెల శివ‌ప్రసాద్‌రావు స‌భ‌ను నిర‌వ‌ధిక వాయిదా వేస్తున్న‌ట్లు ప్రక‌టించారు.

  • Loading...

More Telugu News