: అప్పట్లోనూ ఇటువంటి ఘటన జరిగింది.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు: మొగల్తూరు దుర్ఘటనపై పవన్ కల్యాణ్
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని ఆనంద ఆక్వాఫుడ్ పార్క్లో నిన్న జరిగిన ప్రమాద ఘటనపై సినీనటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ఈ రోజు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇదే ఫ్యాక్టరీలో 2012లోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుందని అన్నారు. అప్పట్లో కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఆ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. సంబంధిత అధికారులు ఇటువంటి పరిశ్రమలపై క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రమాణాలు పాటించని వాటిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
#AnandaAquaGasleak pic.twitter.com/VOifehPVzk
— Pawan Kalyan (@PawanKalyan) 31 March 2017