: అయోధ్య కేసులో మీ స్థానం ఏమిటి?.. మీ వాదనలు వినే సమయం లేదు: సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ పై సుప్రీంకోర్టు
ఎన్నో ఏళ్లుగా పరిష్కారం లేకుండా ఉన్న ‘అయోధ్యలో రామమందిర నిర్మాణం’ వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవలే సూచన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును త్వరగా పరిష్కరించాలంటూ బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, ఈ రోజు ఆ పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే, రామ మందిర వివాదంపై త్వరగా విచారణ నిర్వహించలేమని తేల్చిచెప్పింది. అయోధ్య కేసులో మీ స్థానం ఏమిటని సుబ్రహ్మణ్య స్వామిని కోర్టు ప్రశ్నించింది. ఆయన వాదనలు వినే సమయం తమకు లేదని పేర్కొంది. అయితే, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ... ఈ వివాదం పరిష్కారం ఆలస్యం కావడం వల్ల రామ మందిర స్థానంలో పూజలు చేయలేకపోతున్నానని అన్నారు.