: రూ.2 వేల నోటును రద్దు చేసి రూ.200 నోటు తీసుకురండి.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రతిపాదన


అవినీతి నిర్మూలనకు గతేడాది నవంబరులో రూ.500, రూ.1000 నోట్లను కేంద్రం రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తగా రూ.2 వేల నోటును ప్రవేశపెట్టింది. ఇప్పుడు దానిని కూడా రద్దు చేసి రూ.200 నోటును తీసుకువస్తే బాగుంటుందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రతిపాదించారు. ఆర్థిక బిల్లు-2017పై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా జయదేవ్ తన ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. పెద్ద నోట్లకు కాలపరిమితి విధించాలని, తద్వారా ఆ నోట్లను నిర్ణీత సమయంలో చలామణి నుంచి పూర్తిగా తొలగించేందుకు వీలవుతుందని సూచించారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.2 వేల నోటును ఉపసంహరించి దాని స్థానంలో రూ.200 నోటును తీసుకు రావాలని కోరారు.

  • Loading...

More Telugu News