: పద్మశ్రీ పురస్కారం అందుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కోహ్లీ ఈ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత మురళి మనోహర్ జోషి పద్మ విభూషన్ అవార్డు అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించడంతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పలువురు ప్రముఖులకు గణతంత్ర దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం పద్మపురస్కారాలను ప్రకటించింది. దీనిని అందుకున్న అనంతరం కోహ్లీ 'రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని, తన జీవితంలో మరచిపోలేని రోజని, దేవుడు చాలా దయామయుడని' ట్విట్ చేశాడు.