: గైక్వాడ్ అన్న ఇంటిపేరు ఉండడమే నేరమా?: బీజేపీ ఎంపీ సునీల్ గైక్వాడ్ ఆవేదన
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఘటన అనంతరం పలు విమానాశ్రయాల్లో తనను పదేపదే అడ్డుకుంటున్నారని బీజేపీ ఎంపీ సునీల్ గైక్వాడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, గైక్వాడ్ అన్న ఇంటిపేరు ఉండడమే నేరం అన్నట్టు విమానయాన సంస్థలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కేవలం గైక్వాడ్ అన్న ఇంటిపేరు కలిగిన ఎంపీని కావడంతోనే ఎయిర్ పోర్టుల్లోని సెక్యురిటీ పాయింట్ల వద్ద తనను అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాను ఎంపీనన్న సంగతి కూడా విమానాశ్రయాలు పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. దీనిపై పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాకు ఫిర్యాదు చేశానని ఆయన అన్నారు.