: డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్న చైనా అధ్యక్షుడు.. సర్వత్రా ఆసక్తి
వచ్చే నెల 6-7 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తమ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ సమావేశం కానున్నారని చైనా అధికారులు వెల్లడించారు. ఇరు దేశాల అగ్రనేతలు ఫ్లొరెడాలోని డొనాల్డ్ ట్రంప్ అధికారిక కార్యాలయమైన మార్ ఎ లాగో రిసార్ట్‌లో ముచ్చటిస్తారని తెలిపారు. వీరిరువురి మధ్య ప్రధానంగా వ్యాపార సంబంధాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. మరోవైపు ఉత్తరకొరియా దుందుడుకు చర్యలపై కూడా వీరు చర్చిస్తారని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన చైనాపై పలుసార్లు మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిరువురూ భేటీ కానుండడం పట్ల అందిరిలోనూ ఆసక్తి నెలకొంది.