: స్మిత్ దిగ్గజ ఆటగాడు బ్రాడ్ మన్ ను గుర్తుకు తెచ్చాడు... టీమిండియాను ఇబ్బంది పెట్టాడు!: ఆసీస్ కోచ్


భారత్ లో భారత్ తో జరిగిన సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా ఆడిందని ఆ జట్టు కోచ్ డారెన్ లీమన్ తెలిపాడు. సిరీస్ ముగిసిన సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ, టీమిండియాతో సిరీస్ లో మూడు సెంచరీలతో స్మిత్ అద్భుతంగా రాణించాడని కితాబిచ్చాడు. ఆటగాడిగా, కెప్టెన్ గా స్మిత్ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడని, ఒక దశలో దిగ్గజ బ్యాట్స్ మన్ డాన్ బ్రాడ్ మన్ ను గుర్తుతెచ్చాడని లీమన్ అన్నాడు. ఆసీస్ అత్యుత్తమ టెస్టు కెప్టెన్లలో ఒకడిగా స్మిత్ నిలిచిపోతాడని లీమన్ అభిప్రాయపడ్డాడు. స్మిత్ తన వ్యూహాలు, ఆటతీరుతో టీమిండియాను చాలా ఇబ్బంది పెట్టాడని లీమన్ పేర్కొన్నాడు. స్మిత్ దూకుడు చూసిన టీమిండియా బాధపడిపోయిందని లీమన్ చెప్పాడు. ఈ సిరీస్ లో ఆసీస్ ఆటతీరు భారత్ ను షాక్ కు గురిచేసిందని లీమన్ తెలిపాడు. 

  • Loading...

More Telugu News