: ఈ 'సంగీత్'లో డ్యాన్స్ అపురూపం.. 68 లక్షల మంది చూశారు... మీరు కూడా చూడండి!
కాస్త ధనికులైతే పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలకు అప్పగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ యువతి తన వివాహ సంగీత్ సందర్భంగా వరుడి ముందు డాన్స్ చేసి ఆకట్టుకుంది. ఇందులో విశేషమేంటంటే... ఆమె చేసిన ఈ డాన్స్ లో ఆమెకు స్నేహితులు, కుటుంబ సభ్యులు సహాయంగా ఉండడం విశేషం. పాట ప్రారంభంలో ఆమె డాన్స్ అందుకోగా, వంతుల వారీగా ఆమె స్నేహితులు, సోదరులు, పిన్ని, బాబాయిలు, తల్లిదండ్రులు, ఆఖరుకి నడవడం కష్టమైన నాన్నమ్మ కూడా జత కలవడం ఈ వీడియో ప్రత్యేకత. దీనిని జనవరిలో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా ఇప్పటి వరకు 68 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం. మీరు కూడా ఆ వీడియోను చూడండి.