: భార్య మీరా రాజ్‌పుత్‌ కి షాహిద్‌ కపూర్‌ మళ్లీ పెళ్లి ప్రపోజల్!


‘నన్ను మళ్లీ పెళ్లిచేసుకుంటావా’? అని బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ తన భార్య మీరా రాజ్‌పుత్‌ని స‌ర‌దాగా అడిగాడు. నిన్న ముంబ‌యిలో ‘హెల్లో హాల్‌ ఆఫ్‌ ఫేం’ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఈ జంట పాల్గొన్నారు. మోస్ట్‌ స్టైలిష్‌ కపుల్‌ టైటిల్‌ కూడా అందుకుని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అయితే, ఈ అవార్డు స్వీక‌రిస్తోన్న స‌మ‌యంలో షాహిద్‌ తన మోకాళ్లపై కూర్చుని మీరాను ఇలా అడిగాడు. ఇందుకు మీరా స‌మాధానం ఇస్తూ.. 'ఇది ఆలోచించాల్సిన విషయమే.. అయినప్పటికీ నిన్ను చేసుకుంటా'న‌ని చెప్పింది. ప్రస్తుతం సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న ‘పద్మావతి’ సినిమాలో షాహిద్ క‌పూర్‌ నటిస్తున్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News