: పవన్ మాటల కోసం ఎదురుచూస్తున్న వందలాది మంది!


పవన్ కల్యాణ్ రాకతోనైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామని, తమకు మద్దతుగా ఆయన పోరాటం చేస్తారనే అనుకుంటున్నామని వందలాది మంది అగ్రీగోల్డ్ బాధితులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి వ్యయ ప్రయాసలతో ఈ ఉదయం విజయవాడ చేరుకున్న అగ్రీగోల్డ్ బాధితులు, ఈ విషయంలో పవన్ నిలదీయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే విజయవాడకు చేరుకున్న పవన్, గేట్ వే హోటల్ లో బసచేసి అగ్రీగోల్డ్ సమస్యకు సంబంధించిన పూర్వాపరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన మరికాసేపట్లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాధితులతో మాట్లాడి, ఆపై వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

  • Loading...

More Telugu News