: కబేళాల స్థానంలో ఇప్పుడు టీ స్టాళ్లు.. మారుతున్న యూపీ ముఖచిత్రం!
ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొలువుదీరగానే అక్రమ కబేళాలను మూసేయించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ కబేళాలే ఆధారంగా డబ్బు సంపాదించిన వ్యాపారులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ముజఫర్‌నగర్‌లో పలువురు మాంస విక్రయదారులు టీ వ్యాపారులుగా మారారు. అయితే, తాజాగా మీడియాతో మాట్లాడుతూ... తాము నిర్వహించిన మాంసం దుకాణాలకు లైసెన్సులున్నాయని అయినప్పటికీ వాటిని మూసివేయించారని వాపోయారు. ఇక తాము ఏమీ చేయలేక టీ కొట్లు పెట్టుకున్నామని చెప్పారు.