: ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్!


ఇటీవల ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఈ ఉదయం మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ చక్రపాణి, లోకేష్ తో ప్రమాణ స్వీకారం చేయించగా, ఆ వెంటనే ఆయన్ను అభినందించేందుకు తెలుగుదేశం నేతలు పోటీ పడ్డారు. ప్రమాణ స్వీకారంతో లోకేష్, అధికారికంగా ఎమ్మెల్సీ హోదాను దక్కించుకోగా, ప్రధానమైన శాసనసభలో వచ్చి కూర్చోవాలంటే మాత్రం, ఆయన మంత్రి పదవిని చేపట్టాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన, మంత్రి అయితే, అసెంబ్లీలోకి రావచ్చు. కాగా, ఈ వారంలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, అందులో లోకేష్ కు ఓ బెర్తు ఖాయమని వార్తలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News