: ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు కోరుతూ.. విశాఖలో మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న వైసీపీ పాదయాత్ర
విశాఖపట్టణం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నిర్వహించ తలపెట్టిన ‘ఆత్మగౌరవ యాత్ర’ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. పది గంటలకు అనకాపల్లి నుంచి ప్రారంభం కానున్న యాత్ర జిల్లాలో మొత్తం 162 కిలోమీటర్ల మేర సాగనుంది. అన్ని వర్గాలను కలిసి రైల్వేజోన్ ఆవశ్యకతపై నాయకులు వివరించనున్నారు. 11 రోజులపాటు సాగే ఈ యాత్ర చివరి రోజు బోయిపాలెం, దొరతోట, భీమిలి మీదుగా సాగి చిట్టివలసలో ముగుస్తుంది. యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు తదితరులు హాజరుకానున్నారు.