: హైదరాబాదులో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అదృశ్యం
హైదరాబాదులో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. రాయదుర్గంలోని పోచమ్మ బస్తీకి చెందిన ప్రియాంక అనే మహిళ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తోంది. ఈ నెల 27వ తేదీన ఆఫీసుకు వెళ్తున్నానంటూ చెప్పి బయల్దేరిన ఆమె... ఆ తర్వాత తిరిగి రాలేదు. ఈ నేపథ్యలో, ఆమె భర్త శ్రవణ్ కుమార్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు.