: ఎర్రచందనం కేసులో ఎయిర్ హోస్టెస్ కు 14 రోజుల రిమాండ్
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఎయిర్ హోస్టెస్ సంగీత చటర్జీ (26)ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చిత్తూరు నుంచి ఈ ఉదయం 11.30 గంటలకు పటిష్ట బందోబస్తు మధ్య ఆమెను పాకాల తీసుకొచ్చారు. అనంతరం ఆమెను పాకాల జూనియర్ సివిల్ జడ్జి దేవేంద్ర రెడ్డి ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా సంగీతకు 14 రోజుల రిమాండ్ ను జడ్జి విధించారు. అనంతరం, ఆమెను చిత్తూరు జైలుకు తరలించారు. పలు పోలీస్ స్టేషన్లలో సంగీత, ఆమె భర్త లక్ష్మణ్ లపై కేసులు నమోదై ఉన్నాయి. ఈ రోజు ఉగాది సందర్భంగా కోర్టుకు సెలవు కావడంతో... జడ్జి ఇంటి వద్ద ఆమెను హాజరు పరిచారు.