: 'ఈ ఏడాది కొంత రాజకీయ కల్లోలం వుంటుంది...: పండితుల ఉవాచ


హైదరాబాద్ లోని ప్రగతి భవన్ జనహితలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, స్పీకర్ మధుసూధనాచారి, మండలి చైర్మన్ స్వామి గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. కొన్ని చోట్ల రాజకీయ కల్లోలం ఉంటుందని ఈ సందర్భంగా పంచాంగ పఠనం చేసిన పండితులు సంతోష్ కుమార్ శర్మ చెప్పారు. కలిగయుగంలో మొత్తం 4,32,000 సంవత్సరాలకు ప్రధమ పాదంలో 1,08,000 సంవత్సరాలని సంతోష్ కుమార్ శర్మ తెలిపారు. హేవలంబి 31 సంవత్సరంగా పేర్కొన్నారు. పేరులో సందిగ్ధత అక్కర్లేదన్నారు. హేవలంబి, మేమలంబయా... హేమళంబి ఏదైనాగానీ పర్యాయపదాలేగానీ అర్థాల్లో మార్పు లేదని స్పష్టం చేశారు.

‘‘ఈ సంవత్సరానికి అధిదేవత సూర్యానారాయుడు. రాజులు సక్రమమైన పాలన కావిస్తారు. కొన్ని చోట్ల రాజకీయ కల్లోలానికి ఆస్కారం. దుర్మార్గులు, చోరులు పెరుగుతారు. దైవానుగ్రహం వ్లల వారి ఆటలు సాగవు. మరో మంచి అంశం. వర్షపాతం చక్కగా ఉంటుంది. నవగ్రహాల్లో ఆరుగురికి శుభాధిపత్యం వచ్చింది. ముగ్గురికి పాపాధిపత్యం ఉంది. శుభాధిగ్రహ 21 మంది ఉప నాయకుల్లో 14 మంది శుభ గ్రహాలకు ఆధిపత్యం వచ్చింది. మొత్తం మీద శుభాధిపత్యమే ఉంటుంది.

బుధవారంతో సంవత్సరం ప్రారంభమైంది గనుక రాజు బుధుడు. మంత్రి శుక్రుడు, సేనాధిపతి గురుడు, ధాన్యాధిపతి శని, నీర్సాధిపతి రవి, సస్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి గురుడు, రసాధిపతి బుధుడు. బుధుడు అంటే పండితుడు. బుధుడు రాజయ్యాడు కాబట్టి మన పాలకులు ఆ ప్రభావంతో నిరాఘాటంగా రాష్ట్రాన్ని పాలిస్తారు. వర్షాలు చక్కగా కురుస్తాయి. శుక్రుడు మంత్రి అయ్యాడు. కాస్త విలాసాలు, విందులు, వినోదాలపై ఆసక్తి పెరిగే అవకాశం కనిపిస్తుంది. వర్షాల స్థితి బాగుంటుంది. పంటలు బాగా పండుతాయి’’ అని సంతోష్ కుమార్ శర్మ ఫలితాల గురించి తెలియజేశారు.

  • Loading...

More Telugu News