: ఇది చంద్రబాబు శకం... నవ్యాంధ్ర మూడేళ్ల పసిబిడ్డ: పండితులు
పంచాంగ పఠనం సందర్భంగా ప్రముఖ పండితులు రాజగోపాల చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఉగాది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి అందరినీ ఆకట్టుకున్నాయి. ‘‘ఇటీవల పంచాంగ కర్తల్లో గొప్ప మార్పు కనిపిస్తోంది. నవ్యాంధ్ర ప్రదేశ్ వచ్చిన తర్వాత చంద్రబాబు పేరుతో ఇది మూడో సంవత్సరం అని పంచాంగాల్లో రాస్తున్నారు. శాలివాహన శకం లానే చంద్రబాబు శకం అని పంచాంగ కర్తలు చక్కగా రాస్తుండడం నిజంగా గొప్ప విషయం. తెలంగాణ నుంచి విడిపడ్డాం. నవ్యాంధ్రప్రదేశ్ లో ఉన్నాం. నవ్యాంధ్రప్రదేశ్ మూడేళ్ల పసిబిడ్డ. పసిబిడ్డ తప్పటడుగులు వేస్తే లాలించి పోషించి పరివర్తన చేయాలి. ఇటువంటి జాతిని ముందుకు తీసుకెళ్లే శకం చంద్రబాబు పేరుతో పంచాంగ కర్తలు రాయడం సంతోషకర విషయం’’ అని పేర్కొన్నారు.