: ఉగాది పచ్చడి రుచి చూసిన చంద్రబాబు... ఘనంగా ఉగాది వేడుకలు


విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది పచ్చడి సేవించారు. రుచి అమోఘంగా ఉండడంతో ఒకటికి మూడు సార్లు ఆయన రుచి చూశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయన్ను ఆశీర్వదించారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని దీవించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు, అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పండితులు వేదాంతం రాజగోపాల చక్రవర్తి పంచాంగ పఠనం చేశారు. 

  • Loading...

More Telugu News