: ఉద్యోగం పేరుతో రియాద్ రప్పించి ముగ్గురు మహిళలపై లైంగిక వేధింపులు


సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వెళ్లిన ముగ్గురు తెలుగు మహిళలు అక్కడ తమ యజమానుల ఇళ్లల్లో లైంగిక వేధింపులకు గురవుతున్న విషయం వెలుగు చూసింది. హైదరాబాద్ లోని కాలాపత్తర్ కు చెందిన ఇద్దరు మహిళలు, ఆదిలాబాద్ కు చెందిన ఓ మహిళ ఈ నెల మొదటి వారంలో రియాద్ వెళ్లారు. బ్యూటీ పార్లర్ లో ఉద్యోగం ఉందంటూ ఏజెంట్ వారిని అక్కడికి పంపించాడు. తీరా రియాద్ లో అడుగు పెట్టిన వారిని అక్కడ ఓ ఇంట్లో పనిమనుషులుగా మార్చేశారు. యజమానురాలి కుమారుడు ఏకంగా ఓ గదిలో బంధించి వారిపై లైంగింక వేధింపులకు పాల్పడుతున్నాడు.

ఈ విషయాన్ని బాధితురాళ్లు మెయిల్స్ ద్వారా ఇక్కడి వారికి తెలిపారు. దీంతో ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్ మంగళవారం ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ముగ్గురు మహిళలతో పాటు ఉపాధి కోసం వెళ్లిన మరో డ్రైవర్ సైతం వేధింపులకు గురవుతున్నాడని, వారిని రక్షించాలని అమ్జదుల్లాఖాన్ మంత్రిని కోరారు.

  • Loading...

More Telugu News