: నన్ను గెలిపించండి.. కచ్చ దీవిని తిరిగి తెస్తా.. మేనిఫెస్టోలో దీప హామీ


ఆర్కేనగర్ ఉప ఎన్నిక ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు, ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై ప్రధాన కార్యదర్శి దీపా జయకుమార్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆర్కేనగర్ ప్రజలకు బోలెడన్ని హామీలు ఇచ్చారు. తనను గెలిపిస్తే ఆర్కేనగర్‌లో ట్రాఫిక్ సాఫీగా సాగిపోయేందుకు కీలక ప్రాంతాల్లో వంతెనలు నిర్మిస్తానని, కచ్చదీవిని స్వాధీనం చేసుకునేందుకు పోరాడతానని హామీ ఇచ్చారు. రాయితీతో పడవలు కొనుక్కునేందుకు జాలర్లకు సహకరిస్తానని, జయలలిత మరణంపై ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు సీబీఐతో విచారణ జరిపించేందుకు వీలుగా పోరాడతానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే మెరుగైన రోడ్లు, రక్షిత మంచినీటి సరఫరా తదితరాలను అందించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News