: భారత్ లో వచ్చే మూడేళ్లలో 20,000 ఉద్యోగాలు కల్పిస్తాం: షియోమీ అధినేత


భారత్ లో వచ్చే మూడేళ్లలో 20,000 ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని చైనాకు చెందిన ప్రఖ్యాత స్మార్ట్‌ ఫోన్ కంపెనీ షియోమీ వ్యవస్థాపక సీఈవో లీ జున్ తెలిపారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ సంస్థకు భారత్ అతి ముఖ్యమైన మార్కెట్ అని, అందుకే భారత్‌ లో ఉద్యోగాల కల్పనకు తమ సంస్థ కట్టుబడి ఉందని అన్నారు. ఈ సందర్భంగా భారత్ లో ఉద్యోగాల కల్పనకు తమ సంస్థ చేస్తున్న కృషిని లీ ప్రధానికి వివరించారు.

ప్రజల జీవితాల్లో స్మార్ట్ ఫోన్లు తీసుకొచ్చిన మార్పును ప్రధానికి లీ వివరించారని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా లీ.. షియామీ భారత్‌ లో తయారుచేసిన ‘రెడ్‌ మీ 4ఎ’ ఫోన్ భాగాలను అమర్చిన ఓ అద్దాల పెట్టెను ప్రధానికి బహూకరించారని తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవి శంకర్ ప్రసాద్‌ తో కూడా ఆయన భేటీ అయ్యారని షియోమీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News