: నన్ను అడగగానే మరో ఆలోచన లేకుండా నాని పేరు చెప్పాను: రానా


సినీ పరిశ్రమలో అందరూ తన స్నేహితులేనని ప్రముఖ సినీ నటుడు రానా తెలిపాడు. రేపు ఐఫా అవార్డుల కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నానని ఆయన తెలిపాడు. రేపు కార్యక్రమంలో వ్యాఖ్యాతగా తనకు స్క్రిప్టు పెద్దగా లేదని, ఎవరు కనిపిస్తే వారి మీద జోకులేయడమేనని రానా చెప్పాడు. సినీ పరిశ్రమలో తామంతా ఎంత స్నేహంగా ఉంటామో ఎవరికీ తెలియదని, తొలిసారి రేపు అభిమానులు తమ మధ్య సత్సంబంధాలను ఆస్వాదిస్తారని రానా తెలిపాడు.

సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలను ఉత్తరాదిలో స్టార్ హీరోలు నిర్వహిస్తారని, ఇక్కడ మాత్రం యాంకర్లు నిర్వహిస్తారని, తొలిసారి విభిన్నంగా చేస్తున్నామంటూ ఐఫా వాళ్లు తనను అడిగారని, విభిన్నంగా ఉంటుందని తాను కూడా అంగీకరించానని, తనకు కో హోస్ట్ గా ఎవరు కావాలంటే... వెంటనే మరో ఆలోచన లేకుండా నాని పేరు చెప్పానని రానా తెలిపాడు. తామిద్దరం ఏం కామెంట్ చేసినా మన సినీ ప్రముఖులు సరదాగా తీసుకుంటారని రానా చెప్పాడు. తామంతా కలుస్తుంటామని, అలాంటప్పుడు సరదాగా మాట్లాడుకుంటామని, రేపు ఆ వాతావరణాన్ని మీరు ఎంజాయ్ చేస్తారని రానా చెప్పాడు.

  • Loading...

More Telugu News