: రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు.. హాజరవుతున్న ఇరు రాష్ట్రాల సీఎంలు


హైదరాబాదులోని రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. హేమలంబ నామసంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, తెలంగాణ మంత్రులు కేటీఆర్, నాయిని, పోచారం శ్రీనివాసరెడ్డి, సీపీఐ నారాయణ ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు రాజ్ భవన్ కు చేరుకున్నారు. కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న అతిధులను గవర్నర్ దంపతులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. 

  • Loading...

More Telugu News