: సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తితో డేటింగ్ చేసేందుకు అభ్యంతరం లేదంటున్న కృతి సనన్!
సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తితో డేటింగ్ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని '1 నేనొక్కడినే' సినిమాలో మహేష్ బాబుకి జంటగా నటించిన కృతి సనన్ తెలిపింది. తెలుగులో రెండు సినిమాలు చేసిన ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని, ఈమె ప్రేమలో మునిగి తేలుతున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన సుదీర్ఘ కాల ప్రేయసి అంకిత లోఖండేను కూడా వదిలేశాడని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. వీటికి బలం చేకూరుస్తూ... ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నానని చెప్పిన కృతి సనన్... సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తనకు మంచి స్నేహితుడని చెప్పింది.
‘‘ఎదుటివారితో మన ఆలోచనలు కలవచ్చు లేదా కలవకపోనూ వచ్చు. అయితే ఇద్దరి ఆలోచనలు కలిసినప్పుడే వారిద్దరూ ఒకరికొకరు కనెక్ట్ అవ్వగలరు. అంతేతప్ప ఓ వ్యక్తితో మన రిలేషన్ ని ముందే ప్లాన్ చేసుకోలేం. ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉంటున్నాను. అయితే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో డేటింగ్ చేయడంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. వేరు వేరు వృత్తుల్లో ఉన్నవారితో డేటింగ్ కంటే ఒకే వృత్తిలో ఉన్న బాయ్ ఫ్రెండ్ దొరికితే మనల్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు కదా’’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో తన బంధాన్ని కృతి ఇలా ఇండైరెక్టుగా ఒప్పుకుంటోందని బీటౌన్ వర్గాలు పేర్కొంటున్నాయి.