: సంప్రదాయ వస్త్రాలు ధరించి ఉగాది శుభాకాంక్షలు చెప్పిన బాలీవుడ్ తారలు, సచిన్
మహారాష్ట్రియన్లు జరుపుకునే గుడిపడ్వా (ఉగాది) పర్వదినం సందర్భంగా పలువురు బాలీవుడ్ నటులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, సోనాలీ బింద్రే, రితేశ్దేశ్ముఖ్తో పాటు పలువురు స్టార్లు సంప్రదాయ వస్ర్తాలు ధరించి, తాము కూడా ఈ వేడుక జరుపుకుంటున్నామని ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ కూడా ముంబైలోని తన నివాసంలో భార్య అంజలితో కలిసి ఈ ఉగాది జరుపుకున్నారు. తన భార్య అంజలితో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
गुढीपाडव्याच्या हार्दिक शुभेच्छा #GudiPadwa pic.twitter.com/BtYCMn5zVK
— sachin tendulkar (@sachin_rt) March 28, 2017
T 2477 - Greetings .. shubhkamanyein .. Happy Gudi Padwa .. happy Ugadi .. happy all around .. LOVE