: కిమ్స్ ఆసుపత్రి నుంచి దాసరి డిశ్చార్జ్
దర్శకరత్న దాసరి నారాయణరావు కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జనవరి 29న శ్వాస సంబంధ సమస్యతో హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో దాసరి చేరిన సంగతి తెలిసిందే. అనంతరం ఇన్ఫెక్షన్, ఇతర సమస్యలతో బాధపడిన ఆయనకు సమగ్ర చికిత్సను వైద్యులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించిన సంగతి కూడా తెలిసిందే. సుదీర్ఘ చికిత్స తీసుకున్న ఆయన నేడు కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మరి కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దాసరి డిశ్చార్జ్ కావడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఉగాది సందర్భంగా ఆయన ఆరోగ్యంగా బయటకు రావడం వారిని మరింత ఆనందంలో ముంచెత్తింది.