: ఇనుపరాడ్లు, ఇటుకలతో దాడి చేశార‌ు.. మమ్మల్ని ఎందుకు కొడుతున్నారో కూడా మాకు తెలియదు: బాధిత నైజీరియన్‌


ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్‌ నోయిడాలో ఉన్న ఓ షాపింగ్‌ మాల్‌లో నైజీరియా యువ‌కుడిపై ఇటీవ‌ల జ‌రిగిన దాడికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా ఆఫ్రికన్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ సోషల్‌ మీడియాలో షేర్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ దాడికి గురైన స‌ద‌రు యువ‌కుడు మీడియాతో మాట్లాడుతూ ప‌లు విష‌యాలు తెలిపాడు. త‌మ‌ని ఎందుకు కొడుతున్నారో త‌మ‌కు కూడా తెలియదని అన్నాడు. కొంద‌రు త‌మ‌ని చుట్టుముట్టి.. ఇనుపరాడ్లు, ఇటుకలు, కత్తులతో దాడి చేశార‌ని చెప్పాడు. ఆ స‌మ‌యంలో హెల్ప్‌.. హెల్ప్ అంటూ తాము గ‌ట్టిగా అరిచినా ఒక్క‌రు కూడా ప‌ట్టించుకోలేద‌ని అన్నాడు. త‌మ‌కి కనీసం త‌మ‌ కాలేజీ వాళ్లు కూడా సాయం చేయలేదని చెప్పాడు.
 
గ్రేటర్‌ నోయిడాలో మనీశ్ కారి అనే పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థి డ్రగ్స్‌ అధికంగా తీసుకుని మృతి చెందిన ఘటనలో ఆ విద్యార్థి ఉండే అపార్ట్‌మెంట్‌ సమీపంలో ఉన్న ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార‌ణంగానే నైజీరియన్‌పై షాపింగ్‌ మాల్‌ లో దాడి జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News