: ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. పార్లమెంటు ముందుకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ బిల్లులపై చర్చ జరగనున్న నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలకు బీజేపీ ఈ విప్ జారీ చేసింది. బుధవారం జరిగే లోక్ సభ, రాజ్యసభ సమావేశాల్లో పార్టీ ఎంపీలంతా తప్పని సరిగా పాల్గొనాలని విప్ లో బీజేపీ పేర్కొంది. దేశంలో పన్ను సంస్కరణలకు కీలక ముందడుగుగా భావిస్తున్న జీఎస్టీకి సంబంధించిన నాలుగు బిల్లులను నిన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టగా, దీనిపై చర్చకు బీఏసీ ఆరు గంటల సమయాన్ని కేటాయించింది. అనంతరం ఓటింగ్ జరిగితే అందులో విజయం సాధించేందుకు పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది.