: 'ప్రౌడ్ ఆఫ్ యూ బేబీ' అంటూ చెల్లెలిని అభినందించిన ప్రియాంకా చోప్రా


బాలీవుడ్ హీరోయిన్లు బహుముఖ ప్రతిభ చూపిస్తున్నారు. కేవలం నటనతోనే ఆగిపోవడం లేదు. పాతతరం హీరోయిన్లలా పాటలు కూడా పాడుతున్నారు. ఇప్పటికీ అలియా భట్, శ్రద్ధా కపూర్ తదితరులు ఇలా పాటలు పాడి ఆకట్టుకోగా వారి జాబితాలో తాజాగా పరిణీతి చోప్రా కూడా చేరింది. ఆమె తాజాగా నటిస్తున్న 'మేరీ ప్యారీ బిందూ' సినిమాలో ఒక పాటపాడింది. ఈ పాటను బాలీవుడ్ నటులు ప్రశంసిస్తున్నారు. ఈ పాటపై ఆమె సోదరి, ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా స్పందించింది. 'ప్రౌడ్ ఆఫ్ యూ బేబీ,  యువర్ డాడ్ విల్ బీ ప్రౌడ్, సోవుడ్ మైన్' (నేను గర్వపడుతున్నాను...మీ నాన్న కూడా నాలాగే గర్వపడి ఉంటారు) అంటూ అభినందించింది. కాగా, 'మేరీ ప్యారీ బిందూ' సినిమాలో ‘మానా కే హమ్‌ యార్‌ నహి’ అంటూ సాగే పాటను పాడింది. దీనికి ఆమె అభిమానుల నుంచి విశేషమైన  ఆదరణ లభిస్తోంది. 

  • Loading...

More Telugu News