: చంద్రబాబుకు ‘పట్టి సీమ’ పాయసం అందించిన రైతులు!
‘పట్టిసీమ’తో తామెంతో లబ్ధి పొందామని కృష్ణా డెల్టా రైతులు సంతోషపడుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టిసీమ నీటితో పండిన బియ్యంతో వారు పాయసం తయారు చేశారు. ఉగాది పండగ సందర్భంగా ఈ పాయసాన్ని సీఎంకు, ఎమ్మెల్యేలకు వారు అందించారు. ‘పట్టిసీమ’ ద్వారా గోదావరి జలాలను మళ్లించి డెల్టాను సస్యశ్యామలం చేసినందుకు చంద్రబాబుకు రైతులు తమ ధన్యవాదాలు తెలిపారు. అయితే, ‘పట్టిసీమ’పై మొదటి నుంచి విమర్శలు కురిపించిన వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి కూడా తమ సంతోషాన్ని తెలియజేస్తామని రైతులు పేర్కొనడం గమనార్హం.