: మూతులు నాకే కుక్కల కన్నా మొరిగే కుక్కలు చాలా బెటర్: బండ్ల గణేశ్ కు దర్శకుడు వర్మ కౌంటర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడు’ చిత్రం విడుదల అనంతరం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంధించిన ట్వీట్లపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ‘రామ్ గోపాల్ వర్మ ఓ మొరిగే కుక్క’ అంటూ బండ్ల గణేష్ ఇటీవల ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు స్పందనగా వర్మ తన దైన శైలిలో విరుచుకుపడటమే కాదు, బండ్ల గణేష్ కు అదే స్థాయిలో సమాధానమిచ్చారు. మూతులు నాకే కుక్కల కన్నా మొరిగే కుక్కలు చాలా బెటర్ అని విమర్శించారు. మొరిగే కుక్కలకు కుక్కల్లా ఎలా కరవాలో తెలుసని, మూతులు నాకే కుక్కలు ఎలుకల కంటే అధ్వానమని వర్మ తన ట్వీట్ లో ఎద్దేవా చేశారు.