: పూరి జగన్నాథ్ ప్రతి పని వెనుక చార్మి!.. మెచ్చుకున్న పూరీ!
కొంతకాలం క్రితం వరకు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరుగా కొనసాగిన ఛార్మి... ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ, సినీ పరిశ్రమలోనే పలు రంగాల్లో ఆమె చాలా యాక్టివ్ గా ఉంది. ఈ విషయాన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్ వెల్లడించాడు. తాను చేస్తున్న అన్ని సినిమాలకు ఛార్మి కూడా పని చేస్తోందని చెప్పాడు. 'పూరి కనెక్ట్స్' సంస్థను ఆమె స్వయంగా చూసుకుంటోందని తెలిపాడు. ఈ సంస్థ యాడ్ ఏజెన్సీ, టాలెంట్ మేనేజ్ మెంట్, సినిమా కేస్టింగ్, ఈవెంట్స్, సినిమా ప్రొడక్షన్ తదితర పనులను చూసుకుంటుంది. తన తాజా చిత్రం 'రోగ్'కు సినిమాటోగ్రాఫర్ గా పరిచయం అయిన ముఖేష్ ఈ సంస్థ నుంచే వచ్చాడని పూరి చెప్పాడు. అంతేకాదు, బాలయ్య సినిమాకు కూడా ఇతనే పని చేస్తున్నాడట. ఈ సందర్భంగా ఛార్మిపై పూరి జగన్నాథ్ ప్రశంసలు కురిపించాడు. నటనను సైతం పక్కన పెట్టి ఈ పనులన్నింటినీ చార్మి చూసుకుంటోందని చెప్పాడు.