: రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా మార్చేసి, నవ్వులపాలైన దిగ్విజయ్!
తన పర్యవేక్షణలో వరుసగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలవున్న కారణమో లేక వయసు పైబడుతున్న నేపథ్యమో కాని దిగ్విజయ్ సింగ్ కు తాను ఏమి చేస్తున్నారో ఆయనకే అర్థం కాకుండా ఉంది. పలు సందర్భాల్లో ఆయన పొరపాట్లు చేస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిని ఆయన ప్రధానమంత్రిని చేసి, నవ్వులపాలయ్యారు.
వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రాజ్ కుమారి రత్నాసింగ్ రూపొందించిన ఓ వీడియోను దిగ్విజయ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు, రాజ్ కుమారి ఎవరో కాదని... మాజీ మంత్రి దినేష్ సింగ్ కుమార్తె అని, ఆయన గతంలో ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ కేబినెట్లలో పని చేశారని ట్వీట్ చేశారు. ఈయన ట్వీట్ తో దుమారం చెలరేగింది. రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రధాని అయ్యారో? అంటూ రాజకీయ నాయకులు, నెటిజన్లు నవ్వుకుంటున్నారు. అన్నట్టు, రాజీవ్ గాంధీ అనడానికి బదులు రాహుల్ అని ఆయన పొరపాటుపడ్డారు.