: మా దగ్గరికి వచ్చి మీ లొల్లేంది: వైకాపాపై విరుచుకుపడ్డ కేఈ


ఈ ఉదయం ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన తరువాత, టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతూ, వైకాపా సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న వేళ, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. అధికార పక్షం కూర్చుని ఉన్న స్థానాల వద్దకు వచ్చి, ఎవరు మాట్లాడుతుంటే వారి ముందు నిలబడి వైకాపా సభ్యులు నినాదాలు చేస్తుండగా, కేఈ మాట్లాడారు. తన స్థానాల వద్దకు వచ్చి వైకాపా నినాదాలు చేస్తుండటాన్ని తప్పుబట్టారు. ఈ లొల్లేందని ప్రశ్నించారు. ఈ వైఖరి గర్హనీయమని, ప్రశ్నోత్తరాల తరువాత చర్చిద్దామని చెబుతున్నా వినకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News