: మెగాస్టార్ సినిమా అంటే ఏమిటో చూపిస్తా: పూరీ జగన్నాథ్
తన అభిమాన హీరో చిరంజీవితో ఓ సినిమా చేస్తానని ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలిపాడు. అసలు మెగాస్టార్ అంటే ఏమిటో ఆ సినిమాలో చూపిస్తానని చెప్పాడు. చిన్నప్పుడు చిరంజీవి సినిమా చూడ్డానికి క్యూ లైన్లలో నిలబడి టికెట్లు కొనేవాడినని... థియేటర్ల వద్ద కటౌట్లు కూడా కట్టేవాడినని గుర్తు చేసుకున్నాడు. చిరంజీవి సినిమా షూటింగ్ లు జరుగుతున్నప్పుడు అక్కడకు వెళ్లి, దూరం నుంచి ఆయనను చూసేవాడినని చెప్పాడు. చిరంజీవిని ఇంతగా అభిమానించిన తనకు... ఆయనతో ఓ బ్లాక్ బస్టర్ మూవీ తీయాలనే కసి ఉంటుంది కదా? అని అన్నాడు.