: రోజా నీతులు చెబుతుంటే బూతులు చెబుతున్నట్టే ఉంది!: బుద్ధా వెంకన్న
వైసీపీ ఎమ్మెల్యే రోజా నీతులు చెబుతుంటే, బూతులు చెబుతున్నట్టుగానే ఉందని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నిప్పులు చెరిగారు. ఈ ఉదయం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు వంటి వ్యక్తిని రోజా ఏకవచనంతో పిలుస్తోందని, ఈ వైఖరి ఎంతమాత్రమూ తగదని హితవు పలికారు. చంద్రబాబు శ్రీరాముడైతే, రోజా శూర్పణకని, రామాయణంలోలానే, ఆమె ముక్కూ చెవులను కోశారని, ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు రోజా నాలుకను చీరేస్తారని అన్నారు.